పెళ్లి చేసుకోమంటే ప్రేమించిన యువకుడు నిరాకరించాడనే మనస్థాపంతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లెలోని గాజులపేటలో జరిగింది. ఆ యువతిని వారి కుటుంబసభ్యులు హుటాహుటిన వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను ప్రేమిస్తున్నాని చెప్పి మోసం చేశాడని, అందుకే విషం తాగినట్లు ఆమె చెప్పారు. తనకు ఏదైనా జరిగితే అతనే బాధ్యుడని పేర్కొంది.
ప్రియుడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్యాయత్నం - Crime news in Vempalle, Kadapa district
ఆ ఇద్దరిదీ ఒకే గ్రామం.. రోజూ చూసుకునే క్రమంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడిని కోరింది. కానీ అతడు నిరాకరించడంతో మనస్థాపం చెంది విషపు ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది.
ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య