ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం..పిల్లలు మృతి - ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
18:10 March 18
అభం శుభం తెలియని ముగ్గురు పసిపిల్లలు. ఒకరికి 3 ఏళ్లు, మరొకరికి రెండేళ్లు, అప్పడే నెలలు నిండుతున్న మరో రెండు నెలల పసిబిడ్డ.. ఏమైందో ఏమో కాని ఆ తల్లి.. బిడ్డలందరికీ పురుగుల మందు తాగించింది. అంతటితో ఆగలేదు తానూ ఆ మందును తాగేసింది. పిల్లలంతా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ముగ్గురూ చనిపోయారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
కడపజిల్లా పెండ్లిమర్రి మండలం మిట్టమీద పల్లెలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి ముగ్గురు బిడ్డలకు పురుగుల మందు తాగించి.. తాను తాగింది. పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ముగ్గురు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందారు. తల్లి చిన్నాయ పల్లె నరసమ్మ(23) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు.. సుబ్బరాయుడు(3), సుబ్బరత్న(2)తో పాటు మరో 2 నెలల బాలుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పెండ్లిమర్రి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా నిర్దరించారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్