కడప జిల్లా జమ్మలమడుగులో విజిలెన్స్, ఆహార నియంత్రణ, తూనికలు మరియు కొలతల శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో ధరల వివరాలు సేకరించిన అనంతరం పట్టణంలోని పలు దుకాణాల్లో సోదాలు చేశారు. ఉత్పత్తుల ప్యాకెట్లపై తయారీకి సంబంధించిన వివరాలు లేకపోవడంతో రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే నిత్యావసర సరకులను విక్రయించాలని... అలా కాకుండా ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జమ్మలమడుగులో వివిధ శాఖల అధికారుల ఆకస్మిక తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఇదే అదనుగా చూసుకొని కడప జిల్లా జమ్మలమడుగులో కొందరు వ్యాపారులు అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న వివిధ శాఖల అధికారులు ఏకకాలంలో పట్టణంలోని దుకాణాలపై దాడి చేశారు.
జమ్మలమడుగులో వివిధ శాఖల అధికారుల ఆకస్మిక తనిఖీలు