కడప జిల్లా రాజంపేట, పుల్లంపేటలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు కమనీయంగా జరిగాయి. రాజంపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో వేడుకను వైభవంగా నిర్వహించారు. పుల్లంపేటలోని శివాలయంలో శ్రీవల్లీ దేవసేన సమేత కార్తికేయుని పరిణయ వేడుకను కన్నుల పండువగా సాగించారు. రాజంపేటలోని ఈడిగపాలెం లోని వరసిద్ధివినాయక, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో, వాసవి కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుక నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కమనీయంగా కార్తికేయుని కల్యాణోత్సవాలు - aashada krutika
ఆషాఢమాస కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు.
కల్యాణం