కడప జిల్లా జమ్మలమడుగులో విద్యార్థులు ర్యాలీ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతూ... చక్రాల కిందపడి విద్యార్థిని రాజేశ్వరి మృతి చెందింది. ఆరో తరగతి చదువుతున్న రాజేశ్వరి మరణం... తోటి విద్యార్థులను కలిచివేసింది. స్నేహితురాలి మృతికి నిరసనగా విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని చనిపోయిందని ఆరోపించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి... తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.
తోటి విద్యార్థి మృతి... చిన్నారుల ర్యాలీ..! - student dead in bus accident news
పుస్తకాలు చేతబట్టి బడికి వెళ్లాల్సిన పిల్లలు... ప్లకార్డులు చేతపట్టుకొని రోడ్డుపైకి వచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగులో తోటి విద్యార్థి మృతితో చలించిన చిన్నారులు అధికారుల నిర్లక్ష్యంపై గళమెత్తారు.

కడప జిల్లాలో విద్యార్థులు ర్యాలీ