ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీలోపు కొత్త ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయకుంటే 19వ తేదీ ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. పాత క్యాలెండర్ను రద్దు చేసి కొత్త ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి కూడలి వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
వైకాపా సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 లక్షల 30 వేల ఉద్యోగాల జాబితాను విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి... కేవలం 10 వేల ఉద్యోగాలను మాత్రం విడుదల చేయడం దారుణమని మండిపడ్డారు. ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి నట్టేట ముంచేశాడని ఆరోపించారు. తక్షణం కొత్త ఉద్యోగాల జాబితా విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.