ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటికి పంపించాలని క్వారంటైన్​లో విద్యార్థుల ఆందోళన - కడపజిల్లా కేఎస్ఆర్ఎమ్ క్వారంటైన్ కేంద్రం తాజా వార్తలు

కడప జిల్లా కేఎస్ఆర్ఎమ్ క్వారంటైన్​లో పంజాబ్ నుంచి వచ్చిన బీటెక్ విద్యార్థులు నిరసనకు దిగారు. క్వారంటైన్ కేంద్రంలో ఆహారం సరిగా లేదని, కనీసం శానిటైజర్స్​ను కూడా ఇవ్వట్లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. పంజాబ్ ప్రభుత్వం కోవిడ్ పరీక్షలు చేసి...గృహనిర్బంధానికి సిఫార్సు చేస్తే.. ఈ ప్రభుత్వం క్వారంటైన్​లో ఉంచిందని వారు వాపోయారు.

students protest at kadapa  quarantine center
కడపజిల్లా కేఎస్ఆర్ఎమ్ క్వారంటైన్​లో విద్యార్థుల నిరసన

By

Published : May 21, 2020, 12:09 AM IST

కడపజిల్లా కేఎస్ఆర్ఎమ్ క్వారంటైన్​లో పంజాబ్ నుంచి వచ్చిన బీటెక్ విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నెల 12, 16 తేదీల్లో కడప జిల్లాకు వచ్చిన 47 మంది విద్యార్థులు...కోవిడ్ 19 రూల్స్ ప్రకారం వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో వారికి కరోనా నెగిటివ్ రావడంతో స్థానిక కేఎస్ఆర్ఎమ్ గణేష్ హాస్టల్లో 14 రోజులు కామన్ క్వారంటైన్​కు పంపారు. పంజాబ్ ప్రభుత్వం కోవిడ్ పరీక్షలు చేసి...గృహనిర్బంధానికి సిఫార్సు చేస్తే.. ఈ ప్రభుత్వం క్వారంటైన్​లో ఉంచిందని విద్యార్థులు అధికారులతో గొడవకు దిగారు. రెండు రోజుల నుంచి కనీసం మెనూ ప్రకారం కూడా ఆహారం అందించడంలో అధికారులు విఫలమైనారని విద్యార్థులు ఆరోపించారు. కనీసం మాకు కడుపునిండా అన్నం పెట్టడం లేదని వాపోయారు. శానిటైజర్ కూడా ఇవ్వటంలేదని తెలిపారు.ఇంటికి వెళ్లి గృహనిర్బంధంలో ఉంటామని...ఇంటికి పంపిచాలని అధికారులను వేడుకున్నారు. ఇళ్లకు పంపించేదాకా భోజనం చేయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details