ఈనెల మొదటి నుంచి కరోనా రెండోదశ దడ పుట్టిస్తోంది. కడప జిల్లాలో ప్రతి రోజు 300 నుంచి 600 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. నాలుగు ప్రభుత్వ, 19 ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసినా.. వసతులు నామమాత్రమే. రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్, రెమ్ డెసివిర్ కొరత ఉంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పరీక్షలు రాయాలంటేనే పది, ఇంటర్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 90 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును, వారి ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ భయాలు- పొగాకు కోసం బారులు
ప్రాణాల కంటే పరీక్షలు ముఖ్యమా..?