కడప జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జూనియర్ కళాశాల విద్యార్థులు ఏ.ఐ.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో... నేతాజీ కూడలి బస్ స్టాండ్ రోడ్డు తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఉప తహసిల్దార్ నరసింహ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు ఉధృతమే
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని....కడప జిల్లాలోని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తుందని కొందరు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.
కడప జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాల ధర్నా