కడప జిల్లా రాయచోటిలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. చిత్రనిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి రాయచోటికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని దర్శకుడు కరుణ కుమార్ తెలిపారు. ఈ చిత్రం చక్కని కథతో పాటు విషయాన్ని అందజేస్తుందని ...ఇది కేవలం విద్యార్థులకే కాకుండా, తల్లిదండ్రులకు నచ్చుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమాకు సంబంధించి కొత్త ట్రైలర్ ను పాటలను విడుదల చేశారు. కథానాయకుడు సంజయ్ వర్మ, హీరోయిన్ అహల్య సురేష్ తో పాటు మిగతా చిత్ర బృందం పాల్గొన్నారు.
రాయచోటిలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్ర బృందం సందడి - రాయచోటిలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్ర బృందం వార్తలు
కడప జిల్లా రాయచోటిలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్ర బృందం సందడి చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.
సినిమా విశేషాలను పంచుకున్న చిత్రబృందం