ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి' - kadapa steel plant news

కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఐకాస చేపట్టిన పాదయాత్ర మైదుకూరుకు చేరింది. కేంద్రం.. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటికరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కడపలో సెయిల్​ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

student jac padayatra
విద్యార్థి జేఏసీ పాదయాత్ర

By

Published : Mar 18, 2021, 12:26 PM IST

సెయిల్ ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప జిల్లాలో ఉక్కు క‌ర్మాగారం నిర్మించాల‌నే డిమాండ్​తో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి విద్యార్థి ఐకాస చేప‌ట్టిన పాద‌యాత్ర బుధ‌వారం మైదుకూరు చేరుకుంది. విద్యార్థి ఐకాస నాయ‌కుల వెంట న‌డిచి మైదుకూరు విద్యార్థులు త‌మ సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు.

కేంద్రం వెంట‌నే కడపలో ఉక్కు క‌ర్మాగారం నిర్మించేలా ప్ర‌క‌ట‌న చేయాల‌న్నారు. ల‌క్ష‌లాది మందికి ఉపాధి క‌ల్పిస్తున్న విశాఖ ఉక్కు క‌ర్మాగార ప్రైవేటీక‌ర‌ణను విర‌మించుకోవాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

మైదుకూరులో తెదేపా జోరు.. ఫ్యాన్ గాలిని తట్టుకుని ఎలా సాధ్యమైంది?

ABOUT THE AUTHOR

...view details