కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ.. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 15న జమ్మలమడుగులోని ఉక్కు శిలాఫలకం నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర.. నేడు మైదుకూరు చేరుకుంది. ఈ క్రమంలో స్థానిక విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. అలాగే జేఏసీ నాయకుల వెంట నడిచి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించేలా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కడప ఉక్కు కర్మాగారం నిర్మించాలని విద్యార్థి జేఏసీ పాదయాత్ర - విద్యార్థి జేఏసీ నేతల పాదయాత్ర
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి జేఏసీ పాదయాత్ర చేపట్టారు. సెయిల్ ఆధ్వర్యంలో వెంటనే ఈ పరిశ్రమను నిర్మించాలంటూ నినాదాలు చేశారు.
కడప ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం విద్యార్థి జేఏసీ పాదయాత్ర