దట్టమైన అభయారణ్యంలో కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామ సమీపంలోని ఉంది లంకమల. దీనికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువైన సా లంకలో 7, 14వ శతాబ్దానికి చెందిన పురాతన శాసనాలు లభ్యమయ్యాయి. ముని కుమార్ అనే విద్యార్థి పరిశోధన నిమిత్తం సా లంక ఆలయ ప్రాంతాలకు వెళ్లి పరిశోధనలు చేసేవాడు. కొండూరు గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సాయంతో జరిపిన ఈ పరిశీలనలో పురాతన విగ్రహాలు, శాసనాలు లభ్యమయ్యాయి. నాగ లిపి సంస్కృతంలో ఉన్న శాసనాలను గుర్తించారు.
సా లంకలో శతాబ్ధాల కాలం నాటి శాసనాలు - కడప జిల్లాలో 14వ శతాబ్ధపు విగ్రహాలు లభ్యం తాజా వార్తలు
ముని కుమార్ అనే విద్యార్థి జరిపిన పరిశోధనల్లో కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామ సమీపంలోని లంకమలలో పురాతన విగ్రహాలను గుర్తించారు. ఇవి 7, 14 శతాబ్ధాలకు చెందిన శాసనాలుగా పురావస్తు శాఖ నిపుణులు వెల్లడించారు.
శతాబ్ధాల కాలం నాటి శాసనాలు, విగ్రహాలు
ఇక్కడ లభించిన సార్ పురాతనమైన అరుదైన శాసనాలుగా పురావస్తు శాఖ నిపుణులు తెలిపారు. అయితే 'మచ్చ లంక వెళ్లి వచ్చుట కంటే సా లంక వెళ్లి చచ్చుట మేలు' అన్న నానుడి ఉన్న అటవీ ప్రాంతంలో పరిశోధనలు జరిపి అరుదైన విగ్రహాలను గుర్తించడం అభినందించదగ్గ అంశమని పురావస్తు శాఖ నిపుణులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...