కడప జిల్లా వేంపల్లెలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం రెడ్ జోన్‌గా ప్రకటించింది. అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర అదనపు డీజీ శ్రీధర్ రావు.. జిల్లా ఎస్పీ అన్భురాజన్తో కలిసి లాక్డౌన్ అమలు తీరుపై సమీక్షించారు. ఈనెల 14 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రజలెవరూ బయటకు రాకూడదని డీజీ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా కరోనా మహమ్మారిపై జర్నలిస్టులు పోరాడుతున్నారని ఆయన కొనియాడారు.
'లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అదనపు డీజీ శ్రీధర్ రావు హెచ్చరించారు. కరోనా రెడ్‌జోన్‌గా ప్రకటించిన కడప జిల్లా వేంపల్లిలో పర్యటించిన ఆయన లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు