ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందు నదికి జలకళ... - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలతో కడప జిల్లాలోని కుందు నది జలకళతో కళకళలాడుతోంది. దాదాపు మూడు వేల క్యూసెక్కుల నీరు పరివాహక ప్రాంతం నుంచి వచ్చి చేరినట్లు అధికారులు గుర్తించగా...వేసవి కాలం అనంతరం వర్షపు నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

stream in the kundu river at kadapa district
కుందు నదికి జలకళ

By

Published : Jun 13, 2020, 11:59 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలతో కడప జిల్లాలోని కుందు నది జలకళను సంతరించుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ప్రారంభమయ్యే ఈ నదికి అటు కర్నూలు జిల్లాలోను, ఇటు కడప జిల్లాలోను కురిసిన వర్షాలతో పరివాహక ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరింది. దాదాపు మూడు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. నిన్నటి వరకు వెలవెలబోయిన కుందునది నేడు నీరు ప్రవహించడంతో పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడినట్లయింది. వేసవి కాలం అనంతరం తొలిసారిగా వర్షపు నీరు చేరడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

ABOUT THE AUTHOR

...view details