ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

81 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం ఆవిష్కరణకు సిద్దం - 81 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆవిష్కరణకు సిద్దం

భారతదేశంలోనే ఎక్కడి లేని విధంగా ఎనభై ఒక్క అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహన్ని కడప శివారులోని అలంఖాన్​పల్లి ఈ నెల ఐదో తేదిన చినజీయర్ స్వామి చేతుల మీదుగా అవిష్కరించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Statue of Lord Venkateswara Swamy in cadapa
81 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆవిష్కరణకు సిద్దం

By

Published : Mar 1, 2020, 11:38 PM IST

81 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం ఆవిష్కరణకు సిద్దం

కడప జిల్లా అలంఖాన్​పల్లి వద్ద వేదవ్యాస్ ఆచార్యుల ఆధ్వర్యంలో యతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎనభై ఒక్క అడుగుల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా చిత్రకారులను పిలిపించి ఏడాదిపాటు విగ్రహాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. విగ్రహాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లుగా కనిపిస్తోంది. తిరుమలలో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉందో అదే తరహాలో తయారు చేశారు. స్వామి వారు నిలబడిన విధానం... ఆ చేతులు అచ్చం వేంకటేశ్వర స్వామిని చూసినట్లుగానే కనిపిస్తోంది. అలానే ఆశ్రమంలో చినజీయర్ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు సీతారాముల వివాహ విగ్రహాలను ప్రతిష్టించారు. ఇక్కడ ఉన్న గోశాలలో సుమారు వందకు పైగా ఆవులున్నాయి. ఈనెల ఐదో తేదీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆ వేంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఇలాంటి విగ్రహం ఎక్కడా చూడలేదని స్థానికులు అంటున్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏడాదిన్నర సమయం పట్టిందని తయారీదారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కల్యాణం

ABOUT THE AUTHOR

...view details