తనను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తులసిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లా వేంపల్లెలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. భాజపా మోసగాళ్ల పార్టీ అని... అలాంటి పార్టీతో కలవడానికి తెదేపా, జనసేన, వైకాపా, ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయన్నారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న పార్టీతో పొత్తులు పెట్టుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు.
భాజపా మోసగాళ్ల పార్టీ: తులసిరెడ్డి - tulasi reddy press meet
తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు సోనియా, రాహుల్‌గాంధీకి తులసిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
భాజపాపై ధ్వజమెత్తిన తులసిరెడ్డి