కడప జిల్లా రాజంపేటలో పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన చెందారు. అప్పులు, ఆకలి బాధలతో 47 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు తలపెట్టిన దీక్షకు అన్ని పార్టీలు, కార్మికులు మద్దతు ఇవ్వాలని కోరారు.
చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వండి: తెదేపా రాష్ట్ర కార్యదర్శి - support to sand diskha by tdp
ఇసుక సమస్యపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు సంపూర్ణ సంఘీభావం తెలపాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ కోరారు.
![చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వండి: తెదేపా రాష్ట్ర కార్యదర్శి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5052838-958-5052838-1573648222756.jpg)
చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వండి
చంద్రబాబు దీక్షకు మద్దతు కోరుతున్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చూడండి