ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మహిళా విభాగంలో కడప జిల్లాకు చెందిన విద్యార్థిని రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించింది. వేముల మండలం అమ్మయ్యగారిపల్లె కు చెందిన మమత 97 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు వెంకట కృష్ణారెడ్డి, వనిత ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కడప విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ - కడప జిల్లా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్
కడప జిల్లా అమ్మయ్యగారిపల్లెకు చెందిన ఓ విద్యార్థిని ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. మహిళా విభాగంలో మమత అనే విద్యార్థిని 97 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించింది.
![ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కడప విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ State ranks first for Kadapa district student in women's category in Triple IT results](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9862800-55-9862800-1607849930976.jpg)
మహిళల విభాగంలో కడప జిల్లా విద్యార్థికి స్టేట్ మొదటి ర్యాంక్
తల్లిదండ్రులు తనను చదివించడానికి బాగా కష్టపడే వాళ్లని .. వారి కష్టం వృథా కాకుండా పట్టుదలతో చదివి మొదటి ర్యాంకు సాధించానని మమత అన్నారు. చిన్నప్పటి నుంచి వేంపల్లిలోని ప్రైవేట్ పాఠశాలలోనే చదువుకున్నానని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహకారంతో.. ఉపాధ్యాయుల శిక్షణతోనే మొదటి ర్యాంకు సాధించగలిగానని ఆనందం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి.రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే.?
Last Updated : Dec 13, 2020, 5:11 PM IST