ముగిసిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనాక్ ప్రదర్శన - The state-level Inspire Manac exhibition ended
కడప జిల్లాలో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనాక్ ప్రదర్శన ముగిసింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు.
కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనాక్ ప్రదర్శన ముగిసింది. విద్యార్థులు తయారు చేసిన ఎన్నో ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచారు. వీటిని తిలకించడానికి విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 503 ప్రాజెక్టులు రాగా వాటిల్లో జాతీయ స్థాయికి 51 ప్రదర్శనలు ఎంపికయ్యాయి. జాతీయ ఇన్స్పైర్ మనాక్కు ఎంపికైన విద్యార్థులు అక్కడ కూడా ప్రతిభ చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. విద్యారంగానికి పెద్ద పీట వేస్తూ... సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు చేయూతనిస్తున్నారని తెలిపారు. పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేశారు.