ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర స్థాయి హాకీ సబ్​ జూనియర్స్​ పోటీలు ప్రారంభం - state level hockey comes in rayachoti news

రాష్ట్ర స్థాయి హాకీ సబ్​ జూనియర్స్​ పోటీలను ప్రభుత్వ చీఫ్​ విప్​ గడికోట శ్రీకాంత్​ రెడ్డి కడప జిల్లా రాయచోటిలో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

రాష్ట్ర స్థాయి హాకీ సబ్​ జూనియర్స్​ పోటీలు ప్రారంభం
రాష్ట్ర స్థాయి హాకీ సబ్​ జూనియర్స్​ పోటీలు ప్రారంభం

By

Published : Nov 29, 2019, 8:30 AM IST

రాష్ట్ర స్థాయి హాకీ సబ్​ జూనియర్స్​ పోటీలు ప్రారంభం

కడప జిల్లా రాయచోటిలో రాష్ట్రస్థాయి హాకీ సబ్​ జూనియర్స్​ పోటీలను గురువారం ప్రభుత్వ చీఫ్​ విప్​ గడికోట శ్రీకాంత్​ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన హాకీ క్రీడాకారులు గౌరవ వందనం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విప్​ తెలిపారు. హాకీ కోచ్​లు మరింత కృషి చేసి రాయచోటి క్రీడా కారులు జాతీయ స్థాయిలో ఎంపికయ్యేలా చూడాలని సూచించారు. తొలిరోజు బాలుర విభాగంలో పోటీలు జరిగాయి. కార్యక్రమంలో ఆంధ్ర హాకీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్న కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్, సీఐ చంద్రశేఖర్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details