కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఆర్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థుల జట్టు రాష్ట్రస్థాయిలో రెండవ బహుమతి సాధిందారు. సీనియర్ విభాగంలో ఎస్కే మౌలా బంగారు పతకం, వేణుగోపాల్ రజత పతకం, శివ శంకర్ సిల్వర్ మెడల్ సాధించారు. జూనియర్ విభాగంలో పూజిత, రాజు రజత పతకాలు, గౌరీ శంకర్ సిల్వర్, బాలికల విభాగంలో యశస్విని, ఉష బంగారు పతకాలు, కావ్య రజత పతకం సాధించారు. రాష్ట్ర స్థాయిలో బాలుర విభాగంలో ముగ్గురు, బాలికల విభాగంలో ముగ్గురు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని కోచ్ శివ శంకర్ రాజు తెలిపారు. వీరు ఛత్తీస్గఢ్లో జరగబోయే ఆల్ ఇండియా స్ధాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన చిన్నారులు
రాష్ట్ర స్ధాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కడప జిల్లా విద్యార్ధులు ప్రతిభ చాటారు. పలువురు విద్యార్థులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో ముగ్గురు, బాలుర విభాగంలో ముగ్గురు జాతీయస్ధాయి పోటీలకు అర్హత సాధించారు.
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన చిన్నారులు