ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రాన్ని వైకాపా వైరస్ పట్టిపీడిస్తోంది' - తులసిరెడ్డి తాజా ప్రెస్​మీట్ న్యూస్

ప్రపంచాన్ని కరోనా వైరస్ (కొవిడ్-19) పట్టి పీడిస్తుంటే రాష్ట్రాన్ని వైకాపా వైరస్ పట్టిపీడిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు లాంటివని..., అటువంటి ఎన్నికలు పండుగ వాతావారణంలో జరగాలే కాని ప్రలోభాలకు గురిచేసే విధంగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి ప్రెస్​మీట్​
రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి ప్రెస్​మీట్​

By

Published : Mar 15, 2020, 5:44 PM IST

రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి ప్రెస్​మీట్​

రాష్ట్రంలో ఆటవిక రావణ రౌడీ రాజ్యం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన వైకాపాపై పలు విమర్శులు చేశారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు లాంటివని..., అటువంటి ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలే కానీ ప్రలోభాలకు గురిచేసే విధంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొంటే అవి నిజమైన ఎన్నికలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు, అధికారులే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నేతలను నామినేషన్లు వేయకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు.

ఇదీ చూడండి:అధికార పార్టీ ఖాతాలో భారీగా ఏకగ్రీవాలు

ABOUT THE AUTHOR

...view details