సీఎం జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పిచ్చి తుగ్లక్ పాలన తలపిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏడాదిలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసేలా పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన వైకాపా...అన్ని రంగాల్లో విఫలమైందని మండిపడ్డారు.
'ఏడాదిలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు' - సీఎం జగన్పై తులసిరెడ్డి విమర్శలు
సీఎం జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పిచ్చి తుగ్లక్ పాలన తలపిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు తులసిరెడ్డి