ఇవాళ జరిగే బద్వేలు ఉపఎన్నిక కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే నియోజకవర్గంలోని 281 పోలింగ్ కేంద్రాలకు అధికారులు ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలను తరలించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా వైకాపా నుంచి దివగంత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ బరిలో ఉన్నారు. భాజపా నుంచి పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పోటీలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థులంతా చిన్నచిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు.
BADVEL BY-POLL : నేడు బద్వేలు ఉపఎన్నిక పోలింగ్... ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు - Badvel by-election news
బద్వేలు ఉప ఎన్నిక( Badvel by-election)కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్(State Chief Electoral Officer Vijayanand) తెలిపారు. ఉప ఎన్నికల భద్రత కోసం పోలీసులు, కేంద్ర పారా మిలటరీ బలగాలు భద్రత కల్పించామని విజయానంద్ తెలిపారు.బద్వేలు నియోజకవర్గానికి ఉన్న అన్ని సరిహద్దులనూ మూసివేశామన్నారు.
BADVEL BY-POLL
నియోజకవర్గంలో 2 లక్షల 15 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఏడు మండలాల్లో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 148 అత్యంత సమస్యాత్మం, 52 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందుకు తగ్గట్లు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కేవలం కొవిడ్ బాధితులు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో సిబ్బందికి పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచారు.
ఇదీ చదవండి
BADVEL BY ELECTIONS: బద్వేలు బరిపై వైకాపా గురి.. 30న పోలింగ్, 2న కౌంటింగ్..
Last Updated : Oct 30, 2021, 4:48 AM IST