ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెనుకబడిన ప్రాంతం కాబట్టే రాయచోటి జిల్లా కేంద్రమైంది: శ్రీకాంత్‌రెడ్డి - రాయచోటి జిల్లా కేంద్రంపై శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్

వెనుకబడిన ప్రాంతం కాబట్టే రాయచోటి జిల్లా కేంద్రమైందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అధ్యయనం తర్వాతే రాయచోటిని జిల్లా కేంద్రంగా కమిటీ సిఫార్సు చేసిందన్నారు.

వెనుకబడిన ప్రాంతం కాబట్టే రాయచోటి జిల్లా కేంద్రమైంది
వెనుకబడిన ప్రాంతం కాబట్టే రాయచోటి జిల్లా కేంద్రమైంది

By

Published : Jan 30, 2022, 5:31 PM IST

కడప జిల్లాలో రాయచోటి వెనుకబడిన ప్రాంతం కావడం వల్లే జిల్లా కేంద్రం వచ్చిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేయమని ఎవరూ పైరవీలు చేయలేదన్న శ్రీకాంత్‌రెడ్డి.. కమిటీ నిర్ణయం ప్రకారమే జిల్లా కేంద్రంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. రాయచోటిలోని మౌలిక పరిస్థితులను అధ్యయనం చేశాకే కమిటీ సిఫార్సు చేసిందని అన్నారు. తెలుగుదేశం నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్న ఆయన... విద్యార్థులను రోడ్ల పైకి తీసుకు రావడం మానుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details