కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. నిన్న ఉదయం సర్వభూపాల వాహనంలో స్వామివారిని ఊరేగించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి శ్రీవారి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. కరోనా నిబంధనల కారణంగా ఈ వేడుకకు భక్తులను అనుమతించలేదు. తితిదే అధికారులు, అర్చకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహోత్సవాల్లో నిర్వహిస్తున్న పూజలన్నీ ఏకాంతంగానే జరిపిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.
ఏకాంతంగా శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం - జమ్మలమడుగు తాజావార్తలు
కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం నిర్వహించారు. కరోనా నిబంధనల దృష్ట్యా భక్తులను అనుమతించలేదు. తితిదే అధికారుల సమక్షంలో కార్యక్రమం జరిగింది.
![ఏకాంతంగా శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం kalyanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:31:52:1622264512-ap-cdp-36-28-narapura-kalyanam-av-ap10039-28052021190054-2805f-1622208654-254.jpg)
వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం