కడప జిల్లా గండి క్షేత్రంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మూడో శనివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక హజరై మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడి పాపాఘ్ని నదిలో పుణ్య స్నానాలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
గండిక్షేత్రంలో ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు - చక్రాయపేట
కడప జిల్లా గండి క్షేత్రంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు.
గండిక్షేత్రంలో ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు