బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల తరలింపు కోసం కడప రైల్వేస్టేషన్ నుంచి గురువారం రాత్రి ప్రత్యేక శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేశారు. కడప నుంచి బిహార్‌లోని భాగల్‌పూర్‌కు వెళ్లే ఈ రైలులో 987 మంది బయలుదేరారు. గమ్యస్థానం చేరేలోపు మూడు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించారు. కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆహారం సమకూర్చారు. మాస్కులు అందజేశారు. ఆర్డీఓ మలోలా, డీఎస్పీ సూర్యనారాయణ, నగరపాలక కమిషనర్ లవన్న, తహసీల్దారు శివరామిరెడ్డి, రైల్వే అధికారులు అనూజ్‌కుమార్, స్టాన్లీ, మోహన్‌రెడ్డి, అమరనాథ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రామిక్ రైలులో వెళ్లిన 987 మంది బిహార్ కార్మికులు - maigrants in kadapa
కడప రైల్వేస్టేషన్ నుంచి 987 మంది బిహార్ వలస కార్మికులు శ్రామిక్ ఎక్స్ ప్రెస్ లో గురువారం రాత్రి బయలుదేరారు. ఈ రైలు గమ్యస్థానం చేరేలోపు మూడు స్టేషన్లలో ఆగుతుంది. కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అధికారులు ఆహారం సమకూర్చారు. మాస్కులు అందజేశారు.
శ్రామిక్ రైలులో వెళ్లిన 987 మంది బిహార్ కార్మికులు