రాయలసీమ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్) పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎస్పీవీకి తొలి వాటా కింద ప్రభుత్వం రూ.5 కోట్లు జల వనరులశాఖ బడ్జెట్ నుంచి కేటాయించింది.
రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు అనుమతి - రాయలసీమ ప్రాజెక్టులకు ఎస్పీవీ వార్తలు
రాయలసీమ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ కరవు నివారణ, ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ పేరిట ఓ ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
spv for rayalaseema irrigation projects