కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట బాలికల గురుకుల విద్యాలయంలో భోజనం కోసం పౌరసరఫరాలశాఖ నెలవారీగా బియ్యం సరఫరా చేస్తుంది. ఆ బియ్యాన్ని నిల్వ ఉంచే గది నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గది పైభాగంలో నీటి తొట్టి ఉండడం వల్ల చెమ్మ చేరి బియ్యం బస్తాలు మగ్గిపోయాయి. పాడై పోయిన బియ్యం బస్తాలను వదిలించుకునేందుకు డిప్యూటీ వార్డెన్ ప్రయత్నించారు. బియ్యం బస్తాలను బయటపడేసి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. విషయం బయటకు తెలియడం వల్ల అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు బస్తాలను తిరిగి గదిలో వేయించారు. బియ్యం తగలబెడుతున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాన్సన్, వీఆర్వో రామలక్షణ విద్యాలయానికి చేరుకొని కాల్చి వేసేందుకు బయట వేసిన బియ్యం బస్తాలను పరిశీలించారు. మగ్గిన బస్తాలతో ఉన్న గదిని చూశారు. సంఘటనపై ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందిస్తామని ఆర్ఐ అన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండానే డిప్యూటీ వార్డెన్ బియ్యం కాల్చేందుకు పాల్పడినట్లుగా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు పేర్కొన్నారు.
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. బియ్యం బస్తాలకు నిప్పుపెట్టే ప్రయత్నం - మగ్గిన బియ్యం తగలబెట్టిన వార్డెన్ న్యూస్
ప్రభుత్వ పాఠశాలే కదా అన్న నిర్లక్ష్యం... అధికారుల పర్యవేక్షణ లోపం... సిబ్బంది నిర్వహణ అలసత్వంతో బాలికలకు ఆహారంగా అందాల్సిన బియ్యం మగ్గిపోయి నిరుపయోగంగా మారాయి. బియ్యం నిల్వచేసిన గది పైభాగంలో నీటితొట్టి ఉండడం వల్ల గదిలోకి చెమ్మచేరి బియ్యం పూర్తిగా పాడైపోయాయి. ఈ విషయం బయటకు తెలియకుండా బియ్యాన్ని కాల్చేయాలని చూసిందో డిప్యూటీ వార్డెన్. కడప జిల్లా మైదుకూరులోని వనిపెంటలో జరిగిన ఘటన వివరాలివి.

పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. మగ్గిన బియ్యం నిప్పుపెట్టే ప్రయత్నం
బియ్యం బస్తాలకు నిప్పు పెట్టేందుకు పాఠశాల వార్డెన్ యత్నం
ఇదీ చదవండి:
Last Updated : Feb 12, 2020, 1:22 AM IST