కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కడప జిల్లా మైలవరం పి.ఎస్ పరిధిలోని నవాబుపేట గ్రామంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలనీ.. వారికి అవసరమైన సరుకులు, కూరగాయలు ఇంటివద్దకే పంపిస్తున్నట్లు తెలిపారు. రెడ్జోన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్, పారిశుధ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
'కరోనా నేపథ్యంలో ఇంటివద్దకే నిత్యావసర సరుకులు' - S.P.K.K.N.Anburajan visit in mailavaram
జిల్లా ఎస్పీ అన్బురాజన్ కడప జిల్లా మైలవరం పీఎస్ పరిధిలోని నవాఋపేట గ్రామంలో పర్యటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరోనా నేపథ్యంలో నిత్యవసర సరుకులు ఇంటివద్దకే అందజేస్తాం