కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో.. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. రెడ్ జోన్ పరిధిలోని అనుమానితులకు మొబైల్ వాహనాల్లోనే స్వాబ్ పరీక్షలు ప్రారంభించారు. అనుమానితుల ఇళ్ల వద్దనే నమూనాలు తీసుకుంటున్నారు. వాటిని జిల్లా కొవిడ్ ఆసుపత్రికి నిర్ధరణ కోసం పంపిస్తున్నట్లు డాక్టర్ జహంగీర్ తెలిపారు.
స్వాబ్ నమూనాల స్వీకరణకు ప్రత్యేక వాహనాలు - special vehicles arranged for taking swab samples for corona test
కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు.. 29కు చేరగా.. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. సంచార వైద్య వాహనాలతో అనుమానితులకు పరీక్షలు చేయిస్తున్నారు. జిల్లాకు 5 వాహనాలు సిద్ధం చేశారు.
స్వాబ్ నమూనాలను స్వీకరించేందుకు కడపలో ప్రత్యేక వాహనాలు