అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజలను పురస్కరించుకుని కడప జిల్లా రాజంపేటలో హిందూ సంరక్షణ నాయకులు శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శ్రీరామచంద్రమూర్తి చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి పండితులు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన లడ్డూలతో శ్రీరామ అని రాశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుతూ జైశ్రీరామ్ నినాదాలు చేశారు.
రాజంపేటలో శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు - latest news of ayodhya temple
కడప జిల్లా రాజంపేటలో హిందూ సంరక్షణ నాయకులు శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు.అయోధ్యలో రామందిరం నిర్మాణం త్వరగా పూర్తికావాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు పండితులు తెలిపారు.
special prayers at kadapa dst rajampeta temple about the construction of ayodhya temple