'రాజంపేటలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు' - కడప జిల్లా రాజంపేట పురపాలిక
కరోనా నియంత్రణపై రాజంపేట పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు ఆరోగ్య నియమాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కమిషనర్ రాజశేఖర్ కోరారు.
"కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు"
రాజంపేట పురపాలికలో కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని మురుగు కాలువల శుభ్రత, కాలువల్లో పూడికతీత, దోమల నివారణ మందులు పిచికారి చేస్తున్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోడ పత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టామని... కరోనా అనుమానితులను గుర్తించి వైద్యారోగ్య శాఖ అధికారులకు సమాచారాన్ని అందిస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ రాజశేఖర్ తెలిపారు.