కడప అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే అంజద్ బాషా - ysr
కడప అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుందని స్థానిక శాసన సభ్యుడు అంజద్ బాషా తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో ఎటువంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం... సమూల మార్పులు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... కడప జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారనే నమ్మకం ఉందని కడప వైకాపా ఎమ్మెల్యే అంజద్ బాషా అన్నారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో తనకు ఎలాంటి పదవి అప్పగించినా చిత్తశుద్ధితో న్యాయం చేస్తానని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే కడప నియోజకవర్గ ప్రజల దాహార్తి తీరుస్తాననే మాట ఇచ్చానని... దానిపై ముఖ్యమంత్రితో చర్చించి మాట నిలబెట్టుకుంటానని తెలిపారు. సోమశిల వెనక జలాల నుంచి కడపకు తాగునీరు తీసుకొచ్చే పథకం ఆగి పోయిందని... దాన్ని తిరిగి చేపట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి ముందుకు వస్తారని చెప్పారు. కడప సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజల మార్పు కోరుకున్నారని... కడప జిల్లాలో కూడా స్వీప్ చేయడం వల్ల తమపై మరింత బాధ్యత పెరిగిందంటున్న కడప ఎమ్మెల్యే అంజద్ బాషాతో ఈటీవీ భారత్ ముఖాముఖి..