కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు జరిపారు. 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నిర్వాహకుల ఆచూకీ కొరకు అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నాటుసారా స్థావరాలపై దాడులు.. బెల్లం ఊట ధ్వంసం - kadapa police raid on illegal liquor bases
నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
అనంతరం గ్రామంలో స్పెషల్ పార్టీ టీం తో కలిసి ఇంటింటికీ తిరిగి సారా వల్ల కలిగే నష్టాల గురించి అధికారులు వివరించారు. అనంతరం పాత నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...'నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీ పై చర్యలు తీసుకోవాలి'