కడప జిల్లా వేంపల్లిలో రశీదులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 317 మెట్రిక్ టన్నుల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇసుక కొనుగోలు చేయాలని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇసుక అక్రమ నిల్వలపై అధికారుల దాడులు
కడప జిల్లా వేంపల్లిలోని ఇసుక డంపులపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. 317 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.
'అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు'