ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటిన కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రాలు - కడప సమాచారం

విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లను కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించారు. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ షేక్ అర్షద్, కుళ్లాయప్పలకు ప్రశంసాపత్రాన్ని అందచేశారు. పాదయాత్రలో అస్వస్థతకు గురైన మహిళలు, వృద్దుడిని భుజాన మోసుకుంటూ, ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఇద్దరూ.. పోలీసు శాఖను ప్రజలకు చేరువ చేసి, ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేశారని అన్బురాజన్ ప్రశంసించారు.

sp-appreciation-for-constables-in-kadapa
మానవత్వం చాటుకున్న కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రం అందజేత

By

Published : Dec 29, 2020, 1:48 PM IST

తిరుమలకు పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన వారిని.. విధి నిర్వహణలో భాగంగా భుజాన మోసుకుంటూ, ఆస్పత్రిలో చేర్పించిన కానిస్టేబుళ్లను.. కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించారు. పోలీసు శాఖ తరఫున ప్రశంసాపత్రాన్ని అందచేశారు. తిరుమల మహా పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఓ వృద్ధురాలిని కడప జిల్లా స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టెబుల్ షేక్ అర్షద్ (పీసీ 1269)... దట్టమైన అడవిలో దాదాపు 6 కిలోమీటర్లు భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రిలో చేర్పించారు.

అలాగే.. గత ఏడాది డిసెంబర్​లో పాదయాత్రలో అస్వస్థతకు గురైన ఓ యువతిని స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కుళ్లాయప్ప.. తన భుజాన మోస్తూ తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేశారంటూ.. వీరికి జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details