జిల్లాలో మున్నిపల్ ఎన్నికల పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ పలు సూచనలు చేశారు. ఓటు వేయడానికి వెళ్లే వ్యక్తులు ఎవరు శానిటైజర్లు, వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్ , ఇంకు బాటిళ్లు, తదితర వస్తువులు పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లరాదన్నారు. ఎన్నికలు ప్రశాంత స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మునిసిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఎస్పీ 74 రూట్ మొబైల్స్, 24 స్ట్రైకింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో సమస్యలుంటే డయల్ - 100, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 9121100653 కు సమాచారం ఇవ్వాలని అన్బురాజన్ సూచించారు.
పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలపై.. ఎస్పీ సూచనలు - ఈరోజు ఎస్పీ అన్బురాజన్ తాజా వ్యాఖ్యలు
ఎన్నికలు ప్రశాంత స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు. పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలపై ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలకు భారీ బందోబస్తు
ఇవీ చూడండి...ఏకగ్రీవం వద్దు.. ఎన్నికలే ముద్దంటూ మహిళల ఆందోళన
TAGGED:
Police