డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థను పటిష్ఠ పరచనున్నట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 2019లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన 61 మందికి సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని కడపలో ప్రారంభించారు. నెల రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలని సిబ్బందికి చెప్పారు.
ముఖ్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలన్నారు. ఓ కేసులో సాక్షులు, ఎఫ్ఐఆర్ నమోదు తదితర వివరాలన్నింటినిపై అవగాహన పెంచుకుని.. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.