ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిశ యాప్ ఉంటే.. రక్షణ వెన్నంటి ఉంటుంది: ఎస్పీ అన్బురాజన్ - దిశ వాహనాలు ప్రారంభించిన కడప ఎస్పీ అన్బురాజన్

కడప ఎస్పీ అన్బురాజన్ దిశ వాహనాలను ప్రారంభించారు. ప్రతి ఒక్క మహిళ ఫోన్లలలో దిశ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు.

sp anburajan launches disa vehicles in kadapa
దిశ వాహనాలను ప్రారంభించిన ఎస్పీ అన్బురాజన్

By

Published : Mar 27, 2021, 12:43 PM IST

మహిళలకు రక్షణ కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పుడు ముందంజలో ఉంటుందని కడప ఎస్పీ అన్బురాజన్ అన్నారు. కడప పోలీస్ కార్యాలయంలో 50 దిశ వాహనాలను ఎస్పీ ప్రారంభించారు.. ఈ వాహనాలు జిల్లావ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లకు కేటాయించినట్లు తెలిపారు. మహిళలు, విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా 100కు ఫోన్ చేసిన క్షణాల్లో.. ఘటనా స్థలంలో పోలీసులు ఉంటారని ఎస్పీ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎల్లవేళలా పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక మహిళ తమ ఫోన్లలో దిశ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు. దిశ యాప్ ఉంటే రక్షణ వెన్నంటి ఉంటుందని ఎస్పీ అన్బురాజన్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details