ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మట్టి అమ్మితే.. భూమిని రిజిష్టర్​ చేయాలంటున్నారు' - persons threaten on land lords latest news

కడప జిల్లా కొమ్మద్ది గ్రామానికి చెందిన రెడ్డెమ్మను... భూమి అమ్మాలని కొందరు బెదిరించారన్న ఆరోపణలపై మానవ హక్కుల కన్వీనర్​ జయశ్రీ మండిపడ్డారు. ఈ ఘటన వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

threaten to sell the land
మానవ హక్కుల కన్వీనర్​ జయశ్రీ

By

Published : Jun 30, 2020, 10:37 PM IST

Updated : Jun 30, 2020, 10:49 PM IST

భూమిలోని మట్టిని అమ్మకానికి ఇస్తే ఏకంగా భూమినే రిజిస్ట్రేషన్ చేయించాలంటూ కొందరు వ్యక్తులు పోలీసుల చేత బాధితులను బెదిరిస్తున్నారని మానవ హక్కుల కన్వీనర్ జయశ్రీ ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడారు. వీరపునాయునిపల్లె మండలం కొమ్మద్ది గ్రామానికి చెందిన రెడ్డమ్మకు ఉన్న 9.7 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలని పోలీసులు దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

2008లో సర్వరాయ సాగర్ ప్రాజెక్టు కోసం కొందరు వ్యక్తులు గ్రామంలోని ప్రజలను భూముల అడిగారు. అయితే కొందరు రైతులు పూర్తిగా అమ్మగా.. మరికొందరు భూమిలోని మట్టి అమ్మకానికి మాత్రమే ఒప్పుకొన్నారన్నారు. పన్నెండేళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేవని... తాజాగా ఈనెల 27న ఎర్రగుంట్ల గ్రామీణ సీఐ, రెడ్డెమ్మతో పాటు తన మరిదిని పిలిపించి దుర్భాషలాడి భూమిని రిజిష్టర్​ చేయాల్సిందిగా బెదిరించారని పేర్కొన్నారు.

Last Updated : Jun 30, 2020, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details