ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాటు: పండ్లు అమ్ముతూ బతుకీడుస్తున్న బీటెక్ బాబు! - corona effect on software

అతను సాఫ్ట్​వేర్ ఇంజినీర్. బెంగళూరులో రెండున్నరేళ్ల పాటు పని చేశారు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభించింది. సాఫ్ట్​వేర్ ఉద్యోగం పోయింది. ఏ పని చేయాలో అర్థం కాలేదు. బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా మరి! అందుకే మామిడి పండ్ల విక్రయం ప్రారంభించాడు.

పండ్లు అమ్మి బతుకీడుస్తున్న బీటెక్ బాబు
పండ్లు అమ్మి బతుకీడుస్తున్న బీటెక్ బాబు

By

Published : May 26, 2021, 5:07 PM IST

పండ్లు అమ్ముతూ బతుకీడుస్తున్న బీటెక్ బాబు

కడప రామరాజుపల్లికి చెందిన బి.బాబు కడపలో బీటెక్ పూర్తి చేశాడు. రెండున్నరేళ్ల కిందట బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా చేరాడు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో.. కరోనా భవిష్యత్తును కాటు వేసింది. ఉన్న ఉద్యోగం పోయింది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనం కష్టంగా మారింది. బెంగళూరు నుంచి కడపకు వచ్చేశారు. కుటుంబ పోషణకు వేరే మార్గం కనిపించలేదు. దీంతో గత్యంతరం లేక మామిడి పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details