ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఖర్జూరం సాగు... అధిక దిగుబడితో లాభాల పంట - ఉలవపల్లిలో ఖర్జూరం పండిస్తున్న సాఫ్ట్​వేర్ ఇంజనీర్

ఎడారి పంట అయిన ఖర్జూర సాగు కేవలం సౌదీ అరేబియా తదితర ప్రాంతాల్లోనే పండుతుందని ఒక అపోహ ప్రజల్లో ఉండేది. మన ప్రాంతంలో ఆ మొక్కలు నాటినా పంట రాదని అనుమానం వ్యక్తం చేసేవారు. ఇప్పుడిప్పుడే కడప జిల్లాలో ఖర్జూరాన్ని సాగు చేస్తున్నారు. పంటపై అవగాహనతో సహా మెళకువలు, జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడితో పాటు అధిక లాభాలు పొందవచ్చని యువ రైతులు చెబుతున్నారు.

dates cultivation in kadapa
కడపలో ఖర్జూరం సాగు

By

Published : May 4, 2021, 7:14 PM IST

కడపలో ఖర్జూరం సాగు

అతను ఓ సాఫ్ట్​వేర్ ఇంజనీరు. పేరు కిరణ్ కుమార్ రెడ్డి. కడప జిల్లా పెద్దముడియం మండలం ఉలవపల్లి గ్రామం స్వస్థలం. సుమారు 10 ఏళ్లుగా సాఫ్ట్​వేర్ ఇంజనీర్​గా పని చేస్తున్నారు. వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందునా కొత్త రకాల పంటలు పండించడం అంటే మరింత ఆసక్తి చూపేవారు. అతని సీనియర్ మేనేజర్ సూచనమేరకు ఖర్జూరం సాగు చేయాలన్న ఆలోచన వచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుని, 6 నెలల పరిశోధన అనంతరం.. ఉలవపల్లిలో నాలుగేళ్ల క్రితం ఆ ఆలోచనను ఆచరణలోనికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

ఆరు ఎకరాల్లో 10 మగ మొక్కలు సహా మొత్తం 440 నాటారు. కొత్తలో చుట్టుపక్కల రైతుల నుంచి పలు విమర్శలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఈ మొక్కలు మన ప్రాంతానికి సరిపోవని, దిగుబడి రాదని, నష్టం వస్తుందని అనేక మంది హెచ్చరించినా పట్టించుకోలేదని గుర్తుచేసుకున్నారు. ఉద్యానశాఖ అధికారుల సలహా ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడంతో.. ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తున్నట్లు కిరణ్ కుమార్​ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఖర్జూరం సాగువైపు మరికొంత మంది రైతులు మొగ్గుచూపుతారని భావిస్తున్నానన్నారు.

ఇదీ చదవండి:జేఈఈ మెయిన్స్​ మే సెషన్​ వాయిదా

జిల్లాలోని పెద్దముడియం మండలం ఉలవపల్లిలోనే మొట్టమొదటిసారిగా ఖర్జూరం సాగు చేయడం విశేషం. ఇతర ప్రాంతాలకు చెందిన రైతులు సైతం ఆసక్తి చూపడంతో.. పంట క్రమేణా విస్తరిస్తోంది. ప్రస్తుతం 96.50 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. గాలివీడులో 18 ఎకరాలు, సింహాద్రిపురంలో 15, పులివెందులలో 13 , కోడూరులో 10 , రామాపురంలో 7, పెద్దముడియంలో 6.5, రాజంపేట సంబేపల్లిలో ఐదు, ఎర్రగుంట్లలో 4.5, చక్రాయపేటలో 4, లింగాల వల్లూరులో 2.5, వేములలో 2, వేంపల్లిలో 1.5 చొప్పున పండిస్తున్నారు. ఆధునిక పంటలు పండిచేందుకు ఉద్యానశాఖ అధికారుల నుంచి ఎప్పుడూ ప్రోత్సహం ఉంటుంది. - జయభారత్ రెడ్డి , ఉద్యాన శాఖ అధికారి, పొద్దుటూరు.

ఖర్జూరం సాగు ఖర్చుతో కూడుకున్నదే అయినా తర్వాత మంచి లాభాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ.. కొన్ని మెళకువలు పాటిస్తే ఎలాంటి నష్టం ఉండదని అంటున్నారు.

ఇదీ చదవండి:

ఖరీఫ్​ సీజన్​ ఎరువులకు ప్రణాళిక.. ఆర్బీకేల్లో నిల్వ చేయాలని ఆదేశం

ABOUT THE AUTHOR

...view details