"సీఎంగారు..యురేనియం ప్రాజెక్టులను ఆపండి" - social activists visit in kadapa district
పులివెందుల నియోజకవర్గంలోని యురేనియం ప్రాజెక్టు బాధిత గ్రామాల్లో సామాజిక కార్యకర్త ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం పర్యటించింది. బాధిత గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ప్రాణాలను హరింపజేసే యురేనియం ప్రాజెక్టును ఆపేలా సీఎం జగన్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో నెలకొన్న యురేనియం ప్రాజెక్ట్ బాధిత గ్రామంలో అణు విద్యుత్ వ్యతిరేక సామాజిక కార్యకర్త ఉదయ కుమార్ ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టు బాధిత గ్రామాలైన కొట్టాల, కనంపల్లి, భూమయ్యగారిపల్లి, మబ్బుచింతల పల్లె గ్రామాలను సందర్శించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ప్రాణాలను హరింపజేసే యురేనియం ప్రాజెక్టును మూసివేయాలాని సామాజిక కార్యకర్త ఉదయ్ కుమార్ రాష్ట్ర సీఎం జగన్ ను కోరారు. కర్నూలు, నెల్లూరు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో కూడా యురేనియం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని చూస్తున్నారని..వాటిని ఆపకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.