రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని కడప జిల్లా బద్వేలు రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తొమ్మిది లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బద్వేలు చెందిన సురేంద్ర.. బద్వేలు సమీప గ్రామంలో తక్కువ ధరకు రేషన్ బియ్యం తీసుకొని కర్ణాటకలో అధిక ధరకు విక్రయించేవాడని తెలిపారు.
రూ. 9 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత - Kadapa district latest news
కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న సుమారు 9 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని కడప జిల్లా బద్వేలు రెవెన్యూ, పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ration rice seized at Badvel