కడప జిల్లా మంగంపేట అగ్రహారం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీశాఖాధికారులు అడ్డుకున్నారు. బొలెరో వాహనంలో అరటి గెలలు చాటున అక్రమంగా తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను, ఆ వాహనాన్ని, రైల్వేకోడూరుకు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. 18 ఎర్రచందనం దుంగల విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని ఎఫ్ ఆర్ ఓ నయీమ్ అలీ తెలిపారు.
అరటి గెలల చాటున ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా - illegal red sandal news in kadapa railway koduru
బొలెరో వాహనంలో అరటి గెలల చాటున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇద్దరిని కడప జిల్లా రైల్వేకోడూరులో అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
అరటి గెలల చాటున ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా