కడప జిల్లా వీరబల్లి మండలం సనిపాయి అటవీశాఖ రేంజ్ పరిధిలోని శేషాచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను అధికారులు వెంబడించారు. మల్లికార్జున నాయుడు అనే స్మగ్లర్ పట్టుబడగా మరో 12 మంది పరారైనట్లు సానిపాయి రేంజ్ అధికారులు పేర్కొన్నారు. శేషాచలం అడవిలోని జాండ్రపేట బీట్లో ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. 2.75 టన్నుల బరువు కలిగిన 86 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల విలువ 27లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
శేషాచల అడవుల్లో స్మగ్లింగ్..రూ.27 లక్షల విలువైన ఎర్ర చందనం సీజ్ - red sandal smuggling latest news update
రూ.27 లక్షలు విలువ చేసే ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను కడప జిల్లా వీరబల్లి మండలం సనిపాయి అటవీశాఖ రేంజ్ అధికారులు గుర్తించారు. ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేస్తున్న వీరిని వెంబడించగా ఒకరు పట్టుబడ్డారు..మరో 12 మంది పరారయ్యారు.
శేషాచల అడవుల్లో పెద్ద ఎత్తున స్మగ్లింగ్