కడప జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాశినాయన మండలం కాకినెట్టిపల్లె అడవుల్లో... తరలించడానికి సిద్ధంగా ఉన్న రూ.50 లక్షలు విలువైన 20 ఎర్రచందనం దుంగలు, స్కార్పియో వాహనం, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ దేవప్రసాద్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్ - kadapa district crime
కడప జిల్లా కాకినెట్టిపల్లె అడవుల్లో అక్రమంగా తరలించేదుకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
![ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్ Six smugglers arrested for moving illegal red sandalwood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11673891-1016-11673891-1620381167152.jpg)
ఎర్రచందనం తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్